కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేద ప్రజలకు న్యాయం

….పేద ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
…కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చీమ్ముతున్నారు: ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్
…. నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమలో ఎమ్మెల్యే

కేసముద్రం, జూలై22

గత 11ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన పేద ప్రజల కళ్ళల్లో ఆనందం నింపిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఎమ్మెల్యే డా. మురళీ నాయక్ అన్నారు. మంగళవారం
కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో రైతు వేదిక నందు నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమానికి డా. భూక్యా మురళీ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణి చేసి నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలోనే రేషన్ కార్డుల కల సాకారం అయిందని అన్నారు. కేసముద్రం మండలంలో 4వేల839 మంది కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, 51వేల 893 మంది కొత్త సభ్యుల చేర్పులు జరిగాయాని తెలిపారు..
ఇంకా రేషన్ కార్డు రాని వారు మీ సేవా ద్వారా కానీ, తహసీల్దార్ కార్యాలయంలో కానీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు ప్రతిపక్షాల కళ్ళకు కనిపించడం లేదని ఆరోపించారు. విమర్శలు చేసే ముందు ఆలోచించాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, తలకు మించిన అప్పుల భారం ఉన్నా అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని మనమే కాపాడుకోవాలని కోరారు.
గతంలో ఎన్నడూ లేని, ఏ ప్రభుత్వాలు చేపట్టని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. దేశంలోనే వినూత్ననంగా ఉచిత సన్న బియ్యం పంపిణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పేద ప్రజల ఆకలి తీర్చిన ఏకైక ప్రభుత్వం కూడా కాంగ్రెస్ మాత్రమేనని కొనియాడారు. వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ 21కోట్ల పంట రుణ మాఫీ, రైతు భరోసా, సన్నాలకు బోనస్ అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా సంక్షేమ పథకాల అమలుకు కొత్త బాష్యం చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అనేక ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, తహసీల్దార్ వివేక్, ఎంపీడీవో క్రాంతి, ఏపిఎం రాజీవ్, ట్రాన్స్పోర్ట్ డైరెక్టర్ రావుల మురళి, డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ జడ్పిటిసి బండారి వెంకన్న, జిల్లా నాయకులు, మండల నాయకులు, యూత్ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధులు, డైరెక్టర్లు, మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ కార్డు రావడం సంతోషంగా ఉంది : గాదె గౌతమి, ఇంటికన్నే లబ్ధిదారులు

గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డ్ ఇవ్వలేదు. నానా ఇబ్బందులు పడ్డాము. రేషన్ కార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే మురళీ నాయక్ కు రుణపడి ఉంటాము

రేవంత్ సర్కార్ కృతజ్ఞతలు : గంధసిరి రచన, పెనుగొండ లబ్ధిదారులు

రేవంత్ సర్కార్ చాలా చాలా కృతజ్ఞతలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టుబడి, ఎన్ని ఇబ్బందులు ఉన్న పేదప్రజలకోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. గత ప్రభుత్వంలో చేయలేని పనిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ రేషన్ కార్డులు మంజూరి చేసి నేడు మా కుటుంబానికి అందించడం అనందంగా ఉంది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *