ఘనంగా దాశరధి జయంతి వేడుకలు

మహాతెలంగాణ, కేసముద్రం, జూలై 22:

కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని విలేజ్ కేసముద్రం శ్రీ వివేకవర్ధిని హైస్కూల్ లో మంగళవారం దాశరధి కృష్ణమాచార్యుల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ దాశరధి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం యాకాంతం గౌడ్ మాట్లాడుతూ దాశరధి రగిలించిన చైతన్య స్ఫూర్తి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావలసిన సంకల్ప బలాన్ని ఇచ్చిందన్నారు.
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నా తెలంగాణ కోటి రతనాల వీణా అని అగ్ని ధారలు కురిపించి రుద్రవీణలు పలికించి 19వ ఏటనే జైలుకు వెళ్లిన గొప్ప యోధుడు దాశరధి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిర్ర నరేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *