మహబూబాబాద్ స్ఫూర్తి ఎడ్యుకేషన్ సొసైటీచే ఊచిత టీ షర్ట్ పంపిణీ

ప్రాథమిక పాఠశాల కంబాలపల్లి జడ్.పి.హెచ్.ఎస్ కంబాలపల్లి పాఠశాలలో స్ఫూర్తి ఎడ్యుకేషన్ సొసైటీ మహబూబాబాద్ వారిచే ఊచిత టీ షర్ట్ పంపిణీఅచ్చ ప్రశాంత్ ప్రియాంక దంపతులు మరియు 1996-97 తక్షశిల పబ్లిక్ SSC విద్యార్థులు రామసహాయం జయకర్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది
ప్రాథమిక పాఠశాల ప్రధానోపాద్యులు G లక్ష్మి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశం లో ముఖ్య అతిధిగా జి ఉప్పలయ్య మాట్లాడుతూ స్ఫూర్తి ఎడ్యుకేషన్ సేవలు అభినందనీయం అన్నారు. స్ఫూర్తి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు ఉపాధ్యాయలు రామసహాయం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన అచ్చ ప్రశాంత్ ప్రియాంక దంపతులు తమ పాప ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరిన సందర్భముగా పాఠశాల విద్యార్థుల కు టీ షర్ట్స్ పంపిణీ చేయడం జరిగింది అన్నారు వీరిని ఆదర్శం గా.తీసుకొని ఇంకా కొంత మంది ముందుకు రావాలాన్నారు తమ.సంస్థ ప్రభుత్వ పాఠశాల చదువే పేద పిల్లలకు సహాయం చేయడంలో తమ సంస్థ పని చేస్తుంది అన్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థుల అందరికి ఒకే డ్రెస్ కోడ్ ఉండాలనే లక్ష్యంతో నూతన ఒరవడికి శ్రీకారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థిని విద్యార్థులకు కూడా టీ షర్ట్స్ ఉండాలనే దృఢ సంకల్పంతో సాధ్యమైనంత వరకు అన్ని పాఠశాలలకు ఏకరూప టీ షర్ట్స్ ను అందజేయాలని ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్ణయించుకుంది. దానిలో భాగంగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు అందరికీ టీ షర్ట్స్ ను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమములో తెలంగాణ సాంస్కృతి సారధి జిల్లా అధ్యక్షులు కొలిశెట్టి సత్యనారాయణ ఉపాధ్యాయ బృందం సోహన్ బి శ్రీనివాస్ రావు, అవునూరి రవి, వ్యాయామ ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, సతీష్ కుమార్, వీరభద్రం, మల్లారెడ్డి, తిరుపతి, ఝాన్సీ, సోమేశ్వర్, కృష్ణమూర్తి, యుగేందర్ రాధిక సువర్ణ శ్రీజ , కవిత మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లి తండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *