ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ, మోడల్ స్కూల్ లను అకస్మిక తనిఖీ చేసిన
అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో
హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్ల పై సంబంధిత సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అన్నారు, శనివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు,
ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సబ్ సెంటర్ల వారీగా హెల్త్ ప్రొఫైల్ మైంటైన్ చేయాలని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాత శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, ఆరోగ్య కేంద్రాలలో తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఆయన ఆదేశించారు,
కేజీబీవీ,తెలంగాణ మోడల్ స్కూల్లలో తరగతి గదులను పరిశీలించి పిల్లలకు అందిస్తున్న డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జరుగుతున్న క్లాసులను స్వయంగా పరిశీలించారు, విద్యార్థుల యొక్క విద్యాసామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు,
తెలంగాణ ప్రభుత్వం విద్య వైద్యం న్యూట్రిషన్ సానిటేషన్ లపై ప్రత్యేక చర్యలు కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు, పిల్లలకు నాణ్యమైన రుచికరమైన డైట్ మెనూ ప్రకారం భోజనం అందించాలని, సూచించారు
తరగతి గదులు, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, తదితర ప్రదేశాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు,
పిల్లలకు షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, ఆరోగ్య, మానసిక స్థితిగతులను గమనిస్తూ ఉండాలని సూచించారు,
భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన పరిశుభ్రత పాటిస్తూ ఆహారం సిద్ధం చేయాలని ఆయన తెలిపారు,
పిల్లలకు విద్యతోపాటు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని మానసిక వికాసం కోసం పోటీ పరీక్షలు నిర్వహించాలని ఆయన అన్నారు,ఈ కార్యక్రమంలో అదన కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్, సంబంధిత విద్యా సంస్థల సిబ్బంది ఉన్నారు.