ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి అవయవదానం.. భావి వైద్యుల పరీక్షల కోసం పార్థివ దేహాలను మెడికల్ కళాశాలకు అందజేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మహబూబాబాద్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి. వీరన్న పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ అవయవదాన దినోత్సవం పురస్కరించుకొని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు రక్త, నేత్ర, అవయవ, శరీర దానంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో విపత్కర పరిస్థితుల్లో అనేక వైద్య సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం కోసం లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారని అన్నారు. అలాంటి వారికి రక్తం ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. అలాగే కంటి చూపు సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనే వారికి మరణానంతరం నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికీ కంటి చూపు వస్తుందని తెలిపారు. వివిధ రకాల జబ్బులతో అవయవాలు సక్రమంగా పని చేయని వారికి అవయవాలు దానం చేయడం ద్వారా వారికి పునర్జన్మ లభిస్తుందని పేర్కొన్నారు. మరణానంతరం కూడా సమాజానికి ఫార్థివదేహం మెడికల్ కళాశాలకు అందించడం వల్ల బావి వైద్యులైన మెడికల్ విద్యార్థులకు శవంద్వారా వైద్య విద్య బోధన జరుగుతుంది వెల్లడించారు. మరణించిన తర్వాత కూడా సమాజానికి వారి మృతదేహాలు ద్వారా సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన గార్లపాటి రవితా మహిపాల్ రెడ్డి తన మరణానంతరం మహబూబాబాద్ మెడికల్ కాలేజీకి మృతదేహాన్ని అందించేందుకు తన అంగీకార పత్రాన్ని అందజేశారు. అలాగే వరంగల్ రోటరీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ బండి మన్మోహన్ రెడ్డి @ బండి వాసు, ఆయన తల్లిగారు బండి రమా దేవిలు కూడా తమ మరణానంతరం మెడికల్ కాలేజీకి బాడీలు అందచేసేందుకు అంగీకార పత్రాలు అందించారు. ఇంకా కార్యక్రమంలో సీనియర్ క్లబ్ సభ్యులు పీ. వీ. ప్రసాద్, క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కరుణాకర్ రెడ్డి, గార్లపాటి రవిత ప్రసంగించారు. కార్యక్రమంలో హౌసింగ్ బోర్డ్ కాలనీ పీ. ఎస్. టీలు కట్ల వెంకన్న, గార్లపాటి జయపాల్ రెడ్డి, ఖాసిం, క్లబ్ సభ్యులు పరకాల శ్రీనివాస్ రెడ్డి, మాలె కాశీనాథ్, సాదుల సురేష్, కొండపల్లి శ్రీలత, కాలనీ వాసులు కాలసాని బుచ్చిరెడ్డి, జి. మోహన్ రెడ్డి, ఆర్. వెంకట్ రెడ్డి, బాలునాయక్, యాదగిరి, చలువాది వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
అవయవదానానికి ముందుకు రావాలి.. లయన్స్ క్లబ్ అద్యక్షులు డాక్టర్ బి. వీరన్న
13
Aug