(500) క్వింటాళ్ల నల్ల బెల్లం మరియు (50) క్వింటాళ్ల పటిక ధ్వంసం

ఎక్సైజ్ స్టేషన్ మహబూబాబాద్, గూడూరు మరియు పోలీస్ సబ్ డివిజన్ మహబూబాబాద్ పరిధిలో గల పోలీస్ స్టేషన్లలో దాదాపు గత సంవత్సరం నుండి నాటు సారాయి తయారీ కొరకు రవాణా చేస్తూ పట్టుబడినటువంటి (500) క్వింటాళ్ల నల్ల బెల్లం మరియు (50) క్వింటాళ్ల పటిక ను వరంగల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ జి. అంజన్ రావు గారి ఆదేశాల మేరకు మరియు మహబూబాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీ బి.కిరణ్ గార్ల ఆధ్వర్యంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ సమీపంలో గల మున్నేరు వాగు ప్రవాహంలో మరియు బయ్యారం, డోర్నకల్ మండలాలలో ప్రవహిస్తున్నటువంటి మున్నేరు వాగులో అట్టి నల్ల బెల్లం మరియు పటికను పారవేసి ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు గారు, మహబూబాబాద్ రూరల్ సిఐ, డోర్నకల్ సీఐ, బయ్యారం-గార్ల సీఐ లు, ఎస్సైలు మరియు మహబూబాబాద్, గూడూరు ఎక్సైజ్ సిఐలు, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *