మరిపెడ గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులకు పోలీస్ అవగాహన సదస్సు

జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకాన్ ఐపిఎస్ గారి ఆదేశానుసారంగా గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల , జూనియర్ కళాశాల లో  విద్యార్థులకు అవగాహన కార్యక్రమంనిర్వహించడం జరిగింది మహిళల, విద్యార్థినిల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్న నిర్భయంగా షీ టీం ను లేదా పోలీసులను సంప్రదించాలని షీ టీం ఎస్సై సునంద , మరిపెడ బంగ్లా పోలీస్ స్టేషన్ సెకండ్ ఎస్ఐ కోటేశ్వరరావు గారు సంయుక్తంగా పోలీస్ కళాబృందంతో కలిసి 500 మంది విద్యార్థులకు అవగాహన  కల్పించడం జరిగిందితెలంగాణ గిరిజన సంక్షేమం గురుకుల బాలుర పాఠశాల అండ్  కళాశాల నందు అవగాహన కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ గారు మాట్లాడుతూ ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్స్, భరోసా,  హ్యూమన్ ట్రాఫికింగ్ మూఢనమ్మకాలు మరియు బాల్య వివాహాలు మైనర్ డ్రైవింగ్ ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మహిళలు చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని,ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటాయని సూచించారు. మహిళలు, యువతు లను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని మైనర్ బాలికలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా షీ టీమ్స్ లేదా పోలీసు వారిని సంప్రదించాలని కోరారు. వేధింపులపై నేరుగా గానీ లేక  షి టీం నెంబర్ 871 2656 935 కు లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. చదువుకునే యుక్త వయసులో యువత ప్రలోభాలకు ,ఆకర్షణలకు గురై భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు చేసే ముందు మీ తల్లిదండ్రులకు కష్టాలను గుర్తు తెచ్చుకోవాలని కోరారు. తల్లిదండ్రులను అర్థం చేసుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు.  పోలీస్ కళాబృందం వారి యొక్క పాటలు మరియు మ్యాజిక్ షో ల ద్వారా విద్యార్థులకు మూఢనమ్మకాలు అంటరానితనం బాలివివాహాలు గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో మరిపెడ పిఎస్ సిబ్బంది,  పోలీస్ కళాజాత బృందం సభ్యులు, షీ టీం సిబ్బంది భరోసా లీగల్ అడ్వైజర్ సాహిత్య , మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం పోలీస్లు  ప్రజా, కళాశాల ప్రిన్సిపల్ మాలోత్ సోమాజి గారు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *