రాష్ట్ర సాయి జూనియర్ ఆర్టిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో మహబూబాబాద్ జిల్లా కు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మంచి ప్రతిభ కనబరిచి ఉత్తమ క్రీడాకారులుగా జాతీయస్థాయికి ఎంపిక కావాలని మహబూబాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ నాగమణి సూచించారు. స్థానిక జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ఆదివారం జిల్లాస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడాకారులు మంచి ప్రతిభను కనపరుస్తున్నారని, నిత్యసాధనతో అథ్లెటిక్స్ జాతీయ స్థాయిలో రాణించవచ్చని ఆమె సూచించారు. 24,16,18,20 వయసు కలిగిన బాల బాలికలకు వేరువేరుగా ఈ పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు ఆగస్టు 30 31 తేదీన 11వ తెలంగాణ స్టేట్ జూనియర్స్ అథ్లెక్సీ పోటీలు మహబూబ్ నగర్ లో పాల్గొనడం జరుగుతుందని సెక్రెటరీ నాగమణి తెలిపారు.
రాష్ట్రస్థాయిలో జిల్లా పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి : అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బాస నాగమణి
24
Aug