ఆదివాసి ప్రాంతాల్లో వైద్య సేవలుకోసంప్రత్యేక ప్రణాళిక

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

మహబూబాబాద్ పట్టణంలోని మెడికల్, నర్సింగ్ కాలేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్,దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో 186 కోట్ల వ్యయంతో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజ్, 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్, బాలికలు,బారుల, హాస్టల్ ప్రారంభించి, మూడవ సంవత్సరం చదువుతున్న దమయంతి, స్వాతి, ప్రకాష్ పాండే, మైదేహి వర్మ, అనీషా, యతేశం, తదితర వైద్య విద్యార్థిని,విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆదివాసి ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక చేపట్టిందని అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు (16) ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు నిర్మించి ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించడం కోసం నిబద్దతతో ముందుకు సాగుతుందని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.
వైద్య విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నర్సింగ్ కాలేజీల ద్వారా విద్యార్థిని విద్యార్థులకు ఉపాధి కల్పించడం కోసం ఇతర దేశాల భాషలపై నైపుణ్యత కల్పించడం కోసం వినూత్న కార్యక్రమం చేపడుతుందన్నారు. తద్వారా ఆర్థికంగా స్థిరపడతారని అన్నారు,
ఎన్సిడి నీ నియంత్రించాలని అందుకు వైద్యశాఖ కృషి చేయాలన్నారు, అవయవాల మార్పిడి ద్వారా ఈస్టర్న్ తెలంగాణ హబ్ గా మారాలని సూచించారు. వైద్య రంగంలో నూతన టెక్నాలజీ వినియోగించి ముందుకు సాగాలన్నారు. జిల్లా కేంద్రంలో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్యంకు కోసం ప్రత్యేక కార్యచరణ ద్వారా క్షేత్రస్థాయిలో ఆసుపత్రులు విద్యాసంస్థలు అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికతో అభివృద్ధి, సంక్షేమంపై ముందుకు సాగుతుందని, జిల్లాకు (18) టన్నుల యూరియా రావడం జరుగుతుందని ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కేంద్రంతో చర్చలు జరిపి మరింత యూరియా కోటాను సాధించడం కోసం మంత్రివర్గం ఢిల్లీకి వెళ్లనుందని ఆయన చెప్పారు, వైద్య ఆరోగ్య శాఖ బలోపేతానికి పదోన్నతులు కల్పించి అవసరం ఉన్న మౌలిక వసతులను ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తామని తెలిపారు.
రాష్ట్ర అటవీ,దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుగా ఉంటేనే ఏదైనా చేయగలమని అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని వైద్యశాఖ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో వైద్యుల పోస్టులను భర్తీ చేయాలని మంత్రిని కోరారు.
ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం కాబట్టి పూర్తిస్థాయిలో అధిక నిధులు కేటాయించి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగానే వైద్య,నర్సింగ్ కళాశాలు నిర్మించి మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని అన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గూడూరును ఆపరేట్ చేయాలని, నెల్లికుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జేఎన్టీయూ, జూనియర్ కాలేజీలు, పాఠశాలలు, స్టేడియం, మహబూబాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముఖ్యమంత్రి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు.
ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, జిల్లా అభివృద్ధికి వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ, అటవీ దేవదాయ శాఖ మంత్రులను కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) కె. అనిల్ కుమార్, డిఎంఈ డాక్టర్ కె. నరేంద్ర కుమార్, ఎన్ఎంసి రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ విమల తమస్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లకావత్ వెంకట్, ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *