‘ప్రజాపక్షం’ ప్రజా సమస్యలను ప్రతిబింబింప చేయాలి

ప్రజాపక్షం దినపత్రిక 7వ వార్షికోత్సవంలో జిల్లా సబ్ రిజిస్టర్ రవీంద్రబాబు

మహబూబాబాద్:

కేక్ కట్ చేసి విలేకరులకు యాజమాన్యానికి శుభాకాంక్షలు వెలువ ప్రజాపక్షం దినపత్రిక ప్రజా సమస్యలను ప్రతిబింబం చేసేలా ముందుకు సాగాలని మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ రవీంద్రబాబు అన్నారు బుధవారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రజాపక్షం దినపత్రిక ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విభిన్న కథనాలతో ప్రజాభిమానం పొందుతూ సమాజంలో ప్రజాపక్షం మనుగడ సాధించి పాఠకుల మనసు దోచుకోవాలని పత్రిక తెలుగు అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రజా సమస్యలే ప్రజాపక్షం లక్ష్యం సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి
ప్రజా సమస్యలే ప్రజాపక్షం దినపత్రిక లక్ష్యం అని సిపిఐ జిల్లా కార్యదర్శి అన్నారు. ప్రజాపక్షం దినపత్రిక ఆరు వసంతాలు పూర్తిచేసుకుని 7వ సందర్భంలోకి అడుగుతున్న సందర్భంగా పత్రిక యాజమాన్యానికి విలేకరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో వరిదుడుకులకు ఎదుర్కొంటూ ప్రజల కోసం ప్రజలతోనే నడుపుతున్న పత్రిక ప్రజాపక్షం అని అట్టడుగు వర్గాల నుంచి ఆదరణ పొందుతూ పేదల పక్షాన నుంచి ప్రజలను ఎప్పటికప్పుడు వివిధ కథనాలతో చైతన్యపరిచే పత్రికని విజయ సారధి అన్నారు. ఇది పెట్టుబడిదారులు రాజకీయాల కోసం వచ్చిన పత్రిక కాదని కేవలం ప్రజా సమస్యలపై చేస్తున్న ఉద్యమాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూ సమాజంలో ప్రజలను చైతన్య పరుస్తూ ప్రజాపక్షంగా నిలుస్తున్న ఏకైక దినపత్రిక ప్రజాపక్షం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్ కల్లూరి ప్రభాకర్, కేసముద్రం రిపోర్టర్ జర్నీ శ్రీను, గూడూరు రిపోర్టర్ కరుణాకర్, రెడ్డి సిపిఐ నాయకులు పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, మేక వీరన్న, జలగం ప్రవీణ్, బల్లెం శ్రీకాంత్, పంగా శ్రీనాథ్, జడల నటరాజ్, కూరాకుల పాల్, ఎండి రఫీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *