హరిత మిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్నకు ఘనంగా సన్మానం
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వికాస్ జూనియర్ మరియు పారా మెడికల్ కాలేజీ ప్రేషర్స్ పెర్వల్ పార్టీ సందర్భంగా ముఖ్య అతిథిగా ఇంటర్మీడియట్ జిల్లా అధికారి పాల్గొన్నారు అలాగే ఈ కార్యక్రమానికి పర్యావరణ పరిరక్షణ అంశంపై న మాట్లాడేందుకు నన్ను ఆహ్వానించారు అనంతరం హరిత మిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్నను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చెయ్యాలని విద్యార్ధిని విద్యార్దులకు పిలుపునిచ్చారు ప్రతి ఒక్క విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని మొక్కలు నాటాలని అలాగే ప్లాస్టిక్ వాడకం నిషేదం లో విద్యార్దులు కీలక పాత్ర అవసరమని తెలిపారు భూగర్భ జలాలను కూడా కాపాడుకోవాలి అంటే ప్రతి ఇంటిలో రెండు ఇంకుడు గుంతల తీసుకోవాలని ఇలా చెయ్యడం వల్ల రాబోయే భావితరాల కు భూగర్భ జలాలు అడుగంటి పోకుండా పుష్కలంగా నీరు ఉంటుందని అన్నారు.విద్యార్దులు ఎక్కువగా ఆక్సిజన్ ఇచ్చే రేలా. తులసి నేరేడు. కానుగ.వేప. చింత.మొక్కలు నటీనట్లు అయితే రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొన్నుకుండే అవసరం ఉందని తెలిపారు.అనంతరం విద్యారులకు అతిథులకు మొక్కలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో పరికిపండ్ల అశోక్. జానపద కళాకారుడు నరేష్ అధ్యాపకులు. విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.