11వ వార్డ్ భవాని నగర్ తండాలో పర్యటించిన మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్.

ఈరోజు మహబూబాబాద్ జిల్లాలోని మహబూబాబాద్ పట్టణం నందు గల 11వ వార్డ్ భవాని నగర్ తండాలో మహబూబాబాద్ కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు బోడ రవి నాయక్ గారి ఆధ్వర్యంలో భవాని నగర్ తండాలో పర్యటించిన మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్. ఈ సందర్భంగా భవాని నగర్ తండాలో పలు సమస్యలని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చి త్వరితగతిన పూర్తి చేసేలా గత 40 సంవత్సరాలుగా భవాని నగర్ తండాకు చెందిన స్మశాన వాటిక దాని చుట్టూ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా చెత్త వేసి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్మశాన వాటిక స్థలం కబ్జాకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ తిప్పించి స్మశాన వాటికకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పరచాలని స్మశాన వాటికలో నిరుపయోగంగా ఉన్న బోరింగ్ నీ వెంటనే పునరుద్ధరించాలని అలాగే తండాలోని సమస్యలను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో బోడ రవి నాయక్ మాజీ కౌన్సిలర్ భూక్య లక్ష్మి మరియు గుగులోత్ సక్రు భుక్య దాసు బోడ రమణ, స్వామి, లాలు, నగేష్, క్రాంతి,శ్రీను, రవి, మంగీలాల్, సంతోష్, నాగ, లాలు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *