గూడూరు ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా

కొత్తతరం నాయకులతో అభివృద్ధి సాధ్యం

గూడూరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతాం

గూడూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకడోత్
సునీత కొమ్మాలు నాయక్

మహా తెలంగాణ/ గూడూరు

గూడూరు మండల మేజర్ గ్రామపంచాయతీ నీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని నేడు గూడూరు మండలంలో గెలిచిన ప్రతి ఒక్కరూ కొత్త తరం నాయకులు వారితో అభివృద్ధి సాధ్యపడుతుందని గూడూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ వాంకడోత్ సునీత కొమ్మాలు నాయక్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గూడూరు మండల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమపై నమ్మకం పెట్టుకొని గెలిపించిన మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చుతానని అన్నారు. ఇప్పుడున్న వార్డు మెంబర్లు కానీ ఉపసర్పంచ్ అభ్యర్థులంతా కొత్త తరం నాయకులని వారితో గూడూరు మండల అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. ముఖ్యంగా గూడూరులో త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామని గూడూరు గ్రామపంచాయతీకి వచ్చిన నిధులను ఎక్కడ కూడా వృధాగా పోకుండా గ్రామ అభివృద్ధికి వినియోగిస్తామని అన్నారు. తమ గెలుపు కొరకు పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు ముఖ్యంగా మీడియా మిత్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు గతంలో పదవిలో లేనప్పుడే తాను గ్రామపంచాయతీకి ఎంతో సేవ చేయడం జరిగిందని ప్రజలు తమ నా ఆశీర్వదించి పదవి అని బాధ్యతను నాకు కట్టబెట్టారని అది మరింత భారాన్ని తనపై పెట్టింది కాబట్టి మండల అభివృద్ధి కొరకు అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ చంటి స్వామి, వార్డు మెంబర్లు ఇనుముల శిరీష ఏకాంబరం, గార్ల పాటి శిరీష రాజేష్,గూనే శిరీష శోభన్, పత్యం వెంకన్న, వాంగుడోత్ బద్రి,రాము నాయక్, చీర కుమార్, బీరం శ్రీపాల్ రెడ్డి,ఎండి రసూల్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *