రైల్వే ప్రాజెక్ట్ కోసం ఇక ప్రజా ఉద్యమం

మహబూబాబాద్ :

రైల్వే మెగా మెయింటనెన్స్ డిపో మహబూబాబాద్ లోనే ఏర్ఫాటు చేయడానికి సాదన కమిటీ ఆద్వర్యంలో ఈరోజు గంగపుత్ర భవనంలో విస్తృత సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈసమావేశానికి హాజరైన వక్తలు మాట్లాడుతూ…. సాదన కమిటీ ఆద్వర్యంలో గత వారం రోజుల నుండి రైల్వే అధికారులను, ప్రభుత్వ పెద్దలను, ప్రజాప్రతినిధులను కలిసి ఈ ప్రాంతంలొ ప్రాజెక్ట్ ఆవశ్యకత గురించి తెలుపుతూ విజ్ణప్తులు అందజేశామని, ఒక ప్రక్రియ జరిగింది అని అన్నారు. ఇక చేయాల్సింది ప్రజా ఉద్యమమే అని పేర్కొన్నారు. ప్రజలకు, విద్యార్థులకు ఈ ప్రాజెక్ట్ వల్ల జరిగే ఉద్యోగ, ఉపాది అవకాశాలపై అవగాహనా కల్పిస్తామని అన్నారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలో కొమరం భీం విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మంగళవారం మెగా ర్యాలీ నీ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.అధేవిదంగా జిల్లా లోని ప్రధాన మండలాలకు వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయంచడం జరిగింది.
ఇప్పటివరకు జిల్లాలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు,అన్ని పార్టీల నాయకులు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కృషి చేస్తున్నారని అభినందనీయమని తెలిపారు. ప్రాజెక్ట్ తరలిపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై రాజకీయాలకతీతంగా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఈ సమావేశం లో సాదన కమిటి కన్వీనర్ డా. డోలి సత్యనారాయణ, కో ఆర్డినేటర్ మైస శ్రీనివాస్, కో కన్వినర్ లు మార్నేని వెంకన్న, MD ఖలీల్, సమ్మెట రాజమౌళి, గుగ్గిళ్ల పీరయ్య మాదిగ, పిల్లి సుధాకర్, మండల వెంకన్న, మహ్మద్ ఫరీద్,కొత్తపల్లి రవి, కొండ్ర ఎల్లయ్య, బోడ లక్ష్మణ్,మైస నాగయ్య,కంచ వెంకన్న, మామిడాళ సత్యనారాయణ,సంపంగి రామచంద్రు, పులి శ్రీనివాస్,ప్రమ్ చంద్ వ్యాస్, రావుల సమ్మయ్య,వడ్డెబోయిన శ్రీనివాస్, పట్టాభి.లక్ష్మణ్, దుగ్గి గోపాల్,విష్ణువర్ధన్,మహ్మద్ జానీ,యాకయ్య, హెచ్. లింగయ్య,గౌస్ పాషా, జంపాల యాకయ్య, దేవి ఉపేందర్, మచ్చ వెంకన్న,బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *