విక్టరీ వెంకటేష్ బాబు & రానా బాబు పుట్టినరోజు సందర్బంగా తెలంగాణ దగ్గుబాటి యువత – మహబూబాబాద్ జిల్లా కమిటి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు రోగులకు పండ్ల పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెద్దమాముల అంజి హాజరై కేక్ కట్ చేసి పండ్ల పంపిణి కార్యక్రమం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ మా అభిమాన హీరోలు విక్టరీ వెంకటేష్ బాబు, రానా బాబు కు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. వారి పుట్టినరోజు సందర్బంగా ప్రతి సంవత్సరం సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాం అని అలాగే వారు ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి మంచి సినిమాలు తీసి ప్రేక్షకులను, అభిమానులను అలరించాలని అ భగవంతుడునీ కోరుకుంటూ జిల్లా కమిటి తరుపున మరొక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అభిమాన సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిమ్మద్, లక్ష్మన్, గణేష్, అరవింద్, ఉమేష్, బాబురావ్, అజయ్,శ్రీకాంత్, సుధాకర్ రెడ్డి, సతీష్, వెంకన్న,మహేష్, యాకాంబ్రం, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ లో ఘనంగా సినీ హీరోల జన్మదిన వేడుకలు
14
Dec