మానుకోటలో ఈనెల 23 వసంత పంచమి రోజున సామూహిక అక్షరాభ్యాసం

మహబూబాబాద్/ మహా తెలంగాణ

ఈనెల 23 వసంత పంచమి పర్వదినం పురస్కరించుకొని మహబూబాబాద్ మార్వాడి సత్రంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు శ్రీరంగం మురళీకృష్ణ గర్ర పెల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నాగశుద్ధ పంచమి పవిత్ర దినం విద్యాదేవత శ్రీ సరస్వతి మాత ఆవిర్భావించిన ఈశుభ దినంలో అక్షరాభ్యాసం చేయడం అత్యంత మంగళకరమని వారు తెలిపారు. దీనివల్ల గ్రహణశక్తి వికాసం, జ్ఞాపకశక్తి పెరుగుదల, ధారణ శక్తి పెరుగుదల, మేధాశక్తి, అభివృద్ధి చెందుతాయని చిన్నారుల తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని వారు తెలిపారు. అలాగే మానుకోటలో శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఏర్పాటు లక్ష్యంతో ఈ సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మీ పిల్లల పేర్లు ఒకరోజు ముందుగా నమోదు చేసుకోవాలని ఇతర వివరాలకు శ్రీరంగం మురళీకృష్ణ 9440170130, గర్రెపల్లి వెంకటేశ్వర్లు (జివిఎల్) 9440273767 నంబర్లకు సంప్రదించాల్సిందిగా వారు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *