మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని చిరంజీవి ఫ్యాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు SD మునీర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా 15 వ వార్డు మరియు 30 వ వార్డు నుండి వివిధ పార్టీల నుండి జనసేన పార్టీ లో చేరడం జరిగింది. దీనిలో భాగంగా జనసేన పార్టీ తరఫున 15 వ వార్డు నుండి కే ఉదయ్ కుమార్ మరియు 30 వ వార్డు నుండి వేర్పుల ప్రత్యూష అభ్యర్థులను ప్రకటించిన మహబూబాబాద్ జిల్లా జనసేన పార్టీ మునిసిపల్ ఎన్నికల కోఆర్డినేటర్ దాసరి రావిష్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో SD మునీర్, దాసరి అర్షిక, మోదుగు కాటయ్య, చక్రపాణి గౌడ్, ఆదర్ల రఘు, గోపాల్, ఆసిఫ్, చింతా రమేష్, సందీప్, వివేక్, జన సైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.