మహా తెలంగాణ/ మహబూబాబాద్:
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో భూక్య విజయ ప్రచారంలో దూసుకుపోతున్నారు. 11వ వార్డు ఆడబిడ్డగా తనను గెలిపించాలని వార్డు సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తూ మహిళలను పలకరిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మన వార్డును అభివృద్ధి పథంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.