చేగువేరా పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి

పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు

-పి.డి.ఎస్.యు. ఆధ్వర్యంలో చేగువేరా 59వ వర్ధంతి

మహాతెలంగాణ/ మహబూబాబాద్:

దేశంలో మోడీ మతోన్మాద ఫాసిజానికి, ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తున్న సామ్రాజ్యవాద యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నేటి విద్యార్థి, యువత చేగువేరా పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు పిలుపునిచ్చారు.శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) ఆధ్వర్యంలో ప్రపంచ పోరాట యోధుడు, యూత్ ఐకాన్ ఎర్నెస్తో చేగువేరా 59వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బి.నరసింహరావు మాట్లాడుతూ ప్రపంచ ప్రజలను సామ్రాజ్యవాదల దోపిడి , అగ్రరాజ్యాల ఆధిపత్యం నుండి విముక్తి చేయడానికి చేగువేరా చేసిన పోరాట సాహసాలు, త్యాగాలు నేటి జెన్ జీ విద్యార్థి ,యువతకు నిత్యం స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన స్ఫూర్తితో దేశంలోని పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన సమాన విద్య, వైద్యం కోసం, మరియు కుల ,మత, ఆర్థిక అసమానతలు లేని సమానత్వ సమాజ స్థాపన కోసం పోరాడాలన్నారు.చేగువేరా వర్ధంతి రోజును సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా పాటించాలని విద్యార్థి , యువతను కోరారు.దేశంలో ప్రజాస్వామ్య, లౌకిక, రాజ్యాంగ లక్ష్యాల రక్షణ కోసం జెన్ జీ విద్యార్థులంతా గ్రామీణ ప్రాంతాల్లో ఢిల్లీ తరహా జంతర్ మంతర్ లను సృష్టించి, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు బానోత్ నందీశ్వర్, జిల్లా నాయకులు సాయి చరణ్,నవీన్,రామ్, ప్రకాశ్, మోహన్, మహేష్, రాజేందర్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *