మహాతెలంగాణ/మహబూబాబాద్
దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని హస్తినాపురం దేవి నవరాత్రి ఉత్సవాల్లో రెండో రోజు అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు భక్తి శ్రద్దలతో కుంకుమార్చనతో అమ్మవారికి పట్టి పూజలు చేసి .హారతులు పట్టారు. అనంతరం భక్తులు సమర్పించిన ప్రసాదాల వితరణ చేశారు.