మహాతెలంగాణ/ మహబూబాబాద్:
పీఎం శ్రీ జిల్లా స్థాయి ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్,అథ్లెటిక్స్ క్రీడలు విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ క్రీడలకు జిల్లాలోని 23 పీఎం శ్రీ పాఠశాలల బాలబాలికల క్రీడాకారులు 1200 మంది హాజరయ్యారు. బుధవారం జరిగిన ముగింపు క్రీడలకు ముఖ్య అతిథులుగా ఏసీజీ మందుల శ్రీరాములు, మరియు ఏఎం ఓ వెంకటేశ్వర్లు, స్కూల్ గేమ్స్ జిల్లా సెక్రెటరీ వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రామయ్య,శంకర్ నాయక్, బిక్షపతి,అవారి శ్రీనివాస్, పిల్లి కాశీనాథ్, రామ్మూర్తి, మహంకాళి వెంకటేశ్వర్లు, నాగిరెడ్డి, వీరభద్రం, జక్కి నాగేశ్వరరావు, శ్రీనివాస్,అరుణ,గీత, నిర్మల, రాజకుమారి, సింధు వర్మ, కొమరయ్య పాల్గొన్నారు.