విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

పిఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడల్లో ఏ సి జె మందులు శ్రీరాములు

మహా తెలంగాణ/ మహబూబాబాద్

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని మహబూబాబాద్ విద్యాశాఖ ఏసీజె మందుల శ్రీరాములు సూచించారు. మంగళవారం మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన పీఎం శ్రీ జిల్లాస్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అథ్లెటిక్స్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన మెడల్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఏసీజె మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థుల్లో దేహదారుడు శారీరక అభివృద్ధి కాకుండా స్నేహ సంబంధాలు పెంపొంది క్రమశిక్షణ అలవదుతుందని తద్వారా చదువులో రాణించగలుగుతారని ఆయన అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ఓడినవారు గెలుపొందేందుకు తీసుకోవాల్సిన తర్ఫీదు మెలకువలు నేర్చుకోవాలని, గెలుపొందిన వారు ఆటలో మరింత మెలకువలు నేర్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకునేలా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్, ఏ ఎం ఓ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, అవారి శ్రీనివాస్, రాజేందర్, పిల్లి కాశీనాథ్, మహంకాళి వెంకటేశ్వర్లు, చాంప్లా నాయక్, శంకర్ నాయక్, నాగిరెడ్డి, గీత, రాజకుమారి, అరుణ, నిర్మల, సునీత, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *