ఫలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పక్కా ప్రణాళిక

మహబూబాబాద్ జిల్లాలో 25 మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు

25 మంది జిల్లాస్థాయి ప్రత్యేక అధికారుల నియామకం

ఒక్క రోజే అత్యధికంగా 3828.150 మెట్రిక్ టన్నులు, 76,563 వేల బస్తాల మక్కజొన్నల తరలింపు

కల్లూరి ప్రభాకర్/ మహాతెలంగాణ / మహబూబాబాద్:

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పక్కా ప్రణాళిక ఫలించిన వేళ… ఒక్క రోజే గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా 3828.150 మెట్రిక్ టన్నులు, 76,563 వేల బస్తాల మొక్కజొన్నలు తరలించడం కలెక్టర్ పట్టుదల కార్య నిబద్దతకు నిదర్శనం.పకడ్బందీ వ్యూహంతో రవాణా శాఖ, పోలీస్ శాఖ రెవెన్యూ శాఖలు పూర్తిస్థాయిలో నిమగ్నమై రూపొందించిన ప్రణాళికా ప్రకారం ఈరోజు ఒక్కరోజే అత్యధికంగా 30 వేల బస్తాలు, 3 వేల మెట్రి టన్నుల మక్కజొన్నలను ఇప్పటికే గుర్తించి స్వాధీన పరుచుకున్న మిల్లులు, గోదాములకు తరలించడం జరిగింది. మొక్కజొన్న కేంద్రాల నుంచి ప్రత్యేక అధికారులు, పోలీస్ సహకారంతో గోదాం,మిల్లులకు తరలించారు.ప్రతి మిల్లు, గోదాముకు ఒక అధికారిని, ప్రతి సెంటర్ వద్ద నిత్యం నిబద్ధత కలిగిన ఉద్యోగిని నియమించి ప్రతి గంటకి సమీక్షలు నిర్వహిస్తూ ప్రస్తుత రవాణా సదుపాయాలతో పాటు ఇతర ట్రాక్టర్స్, డీసీఎం తదితర వాహనాల ద్వారా తక్షణమే తరలించారు,జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ ప్రత్యేక శ్రద్ధ వహించి చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి ప్రతి చెక్ పోస్ట్ దగ్గర పోలీస్ అధికారి, జిల్లా యంత్రాంగం తరఫున ఒక అధికారిని నియమించి వచ్చే వాహనాలను మళ్లించి పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో మక్కజొన్నలను తరలించడం కోసం క్షేత్రస్థాయిలో ప్రతి ఇన్స్పెక్టర్, ఎస్సై స్థాయి అధికారులను నియమించారు.ప్రతినిత్యం వైర్లెస్ సెట్ ద్వారా పరిస్థితిని సమక్షిస్తూ వాహనాల లోడింగ్ అన్ లోడింగ్ విషయంలో ప్రత్యేకంగా హమాలీలను అధికంగా నియమించుకొని ముందుకు సాగారు. గత రెండు రోజుల్లో నుండి క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఎస్పీ పోలీస్, జిల్లా ఉన్నతాధికారులు ప్రతీ ఒక్కరూ నిబద్ధతతో పనిచేసే జిల్లా మక్కల లక్ష్యం పూర్తి చేయుటకు చర్యలు తీసుకుంది. అదనపు కలెక్టర్ రెవెన్యూ, ప్రతినిత్యం సంబంధిత సెంటర్ అధికారులు మార్క్ఫెడ్, రవాణా శాఖ అధికారులతో మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ సూచనల ప్రకారం ప్రణాళికలను అమలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికి పనిచేస్తే సాధ్యం కానిది అంటూ ఏదీ ఉండదు అనడానికి మొక్కజొన్నలు రికార్డు స్థాయి లో గోదాం, మిల్లులకు తరలించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *