మహాతెలంగాణ/మహబూబాబాద్:
నిర్మల్ జిల్లాలో ఈ నెల 12 నుండి 14 వరకు జరగబోవు రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు 14 మరియు 17 సంవత్సరాల విభాగం లో మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగుజెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు చెందిన కొర్ర మమత, బానోత్ కుమార్ ఎంపిక అయినట్లు హెచ్ఎం కె జానయ్య గారు మరియు పి డి పిల్లి కమల్ కిషోర్ తెలిపారు.వీరి ఎంపిక పట్ల పాఠశాల బృందం హర్షం వ్యక్తం చేశారు. భద్రు , యాదగిరి, సురేష్ , మహేష్, శ్రీధర్,రాంసింగ్, రమ ,శోభారాణి , బాబు మరియు సర్పంచ్ బండ రాజేశ్వరి,ఉపసర్పంచ్ తురక వెంకటేష్ గార్లు అభినందనలు తెలియచేశారు.