ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రటరీ వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి
మహాతెలంగాణ/మరిపెడ :
మహబూబాబాద్ జిల్లా మరిపెడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో గురువారం జరిగిన 70వ ఎస్.జి. ఎఫ్. ఐ సెపక్ తక్రా బాల బాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా సెలక్షన్స్ ఎస్జీఎఫ్ఐ సెకరెటరీ వాసిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుండి సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ క్రీడలతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందిస్తాయని క్రమశిక్షణ అలవాటు ఉందని చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించడం వల్ల మంచి ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ వైస్ ప్రిన్సిపల్, యమ్. శ్రీనివాసరావు, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రమేష్ యాదవ్,ఫిజికల్ డైరెక్టర్లు వంగ రవి, బేస్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కే ప్రభాకర్, శంకర్ నాయక్, బూర్గుల రవీందర్,నాగిరెడ్డి, అవారి శ్రీనివాస్,మహంకాళి వెంకటేశ్వర్లు, రాజు, వరప్రసాద్,అనిల్, ఇమామ్, రాజు,వరప్రసాద్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.