మహాతెలంగాణ/ మహబూబాబాద్
మహబూబాబాద్ నూతన జిఏసివోగా విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు ఇప్పటివరకు విధుల్లో ఉన్న యద్దన పూడి గాయత్రి మెడికల్ లీవ్ దరఖాస్తు చేసుకోవడంతో ఆమె స్థానాల్లో వి ఎస్ లక్ష్మి పురం కు చెందిన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు.. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్, ఇన్చార్జి డిఈవో అనిల్ కుమార్ చేతుల మీదుగా విజయలక్ష్మి ఉత్తర్వులు అందుకున్నారు. ఇప్పటివరకు పనిచేసిన గాయత్రిని తను నిర్వర్తించిన విధులు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ జాయింట్ కలెక్టర్ అభినందించారు. ఆమెను ఆదర్శంగా తీసుకొని విధులు సక్రమంగా నిర్వహించాలని నూతనంగా విధులు చేపట్టిన విజయలక్ష్మికి జె సి సూచించారు. జిల్లాలో కస్తూర్బా విద్యాలయాలను ఆదర్శంగా తీర్చి దిద్దాలని నూతన బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మికి జెసి సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ జి ఇ సి ఓ గాయత్రితో పాటు ఏసిజి, ఏడి మందుల శ్రీరాములు,జిల్లా విద్యాశాఖ అధికారులు, కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు.