అభివృద్ధి ఒకవైపు-పర్యావరణం విధ్వంసం మరోవైపు

ఎల్ ని నో ను ఎదుర్కొనేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి

నీటిని పొదుపుగా వాడుకోవాలి – మొక్కలు నాటి పర్యావరణం కాపాడుదాం

మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి, కాళోజీ వాకర్స్ గౌరవ అధ్యక్షులు డోలి సత్యనారాయణ

మహాతెలంగాణ/మహబూబాబాద్:

అభివృద్ధి ఒకవైపు- ఆ అభివృద్ధి ని ఆటంకపరుస్తూ పర్యావరణం విధ్వంసం మరోవైపు విలయ తాండవం చేస్తూ కరువు దిశగా పయనిస్తున్నాయని, ఎల్ ని నో ను ఎదుర్కొనేందుకు ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ రూరల్ సిఐ అంజలి, కాళోజీ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ డోలి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్ నినో పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎన్ టి ఆర్ స్టేడియం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ నినాదాలు చేస్తూ, ప్లే కార్డ్స్ ప్రదర్శిస్తూ రైల్వే స్టేషన్ సెంటర్ మదర్ తెరిసా విగ్రహం వరకు కొనసాగింది. వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ ర్యాలీని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాళోజీ వాకర్స్ అసోసియేషన్ తన సామాజిక బాధ్యతగా ప్రపంచంలో ఏర్పడిన ఎల్ నినో కారణంగా సంభవించే దుర్భిక్ష పరిస్థితులను, తద్వారా మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలపై మహబూబాబాద్ ప్రజలకు అవగాహన కలిగించుటకు ఈ ర్యాలీ నిర్వహించినందుకు సంతోషంగా ఉంది అని అన్నారు. ప్రపంచంలోనే అనేక దేశాలు ఎల్ నినో కారణంగా అనేక నీటి సమస్యలు విద్యుత్తు సమస్యలు ఎదుర్కొనబోతున్నాయి. అలాగే ప్లాస్టిక్ వలన పర్యావరణం నాశనం అవుతుంది అని, తద్వారా అనేక రకాల వ్యాధులు సంభవిస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఎల్ నినో కారణంగా రాబోయే ఏడు,ఎనిమిది నెలల కాలంలో నీటి సమస్య, విద్యుత్ సమస్య ఏర్పడబోతోంది. అందుకని ప్రజలు తమ నిత్య జీవితంలో నీటిని వీలైనంత పొదుపుగా వాడుకొనవలెనని, విద్యుత్తును కూడా ఆదా చేయవలసిన అవసరం ఉంది అని అన్నారు. నిత్యజీవితంలో ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని అన్నారు. ఎల్ నినో ప్రభావ ఫలితాలను ప్రభుత్వం అనేక మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరిస్తూ వస్తుంది. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకుంటూ ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో త్రివర్ణ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రామలింగారెడ్డి, ఎంజీఎఫ్ వెంకటరెడ్డి, నలంద డిగ్రీ కళాశాల అధ్యాపకులు ప్రసాద్, రమేష్, ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు పాల్గొన్నారు, కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య, కోశాధికారి సోమ విష్ణువర్ధన్, గౌరవ సలహాదారులు మైస నాగయ్య,పెద్ది వెంకన్న, జిలకర శ్రీహరి, దేవేందర్ రెడ్డి, వెంకన్న, రాజన్న, మధుసూదన్ రెడ్డి, పులి దామోదర్, రామకృష్ణ, వెంకటేశ్వర్లు, గోన శ్యామ్ రావు, వేముల రవీందర్, మధుకర్, పగడయ్య, నరసయ్య, హట్యా నాయక్, బి ఆర్ రావు, శంకర్, శ్రీనివాస్, దేవ్ సింగ్, కోడెం శ్రీనివాస్, సురేష్, శ్రీనివాస్ రెడ్డి, వీరేందర్ గౌడ్, శేఖర్, లాలూ నాయక్, రాము, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *