ఎడ్యుకేషన్ -హెల్త్- శానిటేషన్- న్యూట్రిషన్ పై మిషన్ మూడ్ లో ప్రత్యేక అధికారులు

DISTRICT COLLECTOR

వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు, అంగన్వాడి కేంద్రాలు, పునర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గత వారం రోజులుగా (మిషన్ మూడ్) యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక అధికారులు విద్యాసంస్థలు,అంగన్వాడి కేంద్రాల సానిటేషన్, పరిశుభ్రత విద్యుత్, ఫ్యాన్స్, టేబుల్స్, టాయిలెట్స్ క్లాస్ రూమ్స్, బ్లాక్ బోర్డ్, యూనిఫార్మ్స్,తదితర అన్ని సౌకర్యాలను సిద్ధం చేస్తూ ఒక పండుగ వాతావరణం లో పాఠశాలలను ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం సూచించిన ప్రకారము బడిబాట కార్యక్రమం వాడవాడల, గ్రామ గ్రామాన, నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలలో విద్యాబోధనలు , అందిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు విద్యాసంస్థలలో అంగన్వాడీ కేంద్రాలలో నాణ్యమైన బలవర్ధకమైన ఆహారాన్ని మధ్యాహ్నం భోజనం గా అల్పాహారంగా న్యూట్రిషన్ ఫుడ్ గా అందించడం ద్వారా ప్రభుత్వ సంస్థలలో హాజరు శాతం పెంచేందుకు ప్రత్యేక అధికారులు హెచ్ఎంలు కాంప్లెక్స్ ఇన్చార్జులు ప్రతి ఒక్కరు ఒక ఉద్యమం రూపంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు.
ఇప్పటికే ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలలో విద్యాసంస్థలు అంగన్వాడీ కేంద్రాలు ఆరోగ్య కేంద్రాలు తనిఖీలు నిర్వహించి ఎలాంటి జాప్యం లేకుండా ఏర్పాటులను చేస్తున్నారు.
అంగన్వాడి కేంద్రాలలో పౌష్టిక ఆహారం అందిస్తూ పిల్లల యొక్క లెర్నింగ్ లెవెల్స్ శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల తదితర (5) అంశాలపై దృష్టి పెట్టి
క్లాస్ రూమ్ లు అత్యంత పరిశుభ్రంగా ఉంచి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకు విద్యను అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాలు, పర్యవేక్షణలో జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి,
మరిపెడ మండలంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో, ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, డోర్నకల్ మండల ప్రత్యేక అధికారి నరసింహమూర్తి,
కురవి మండలం లో ప్రత్యేక అధికారి నరసింహ స్వామి, సిరోలు ఈఎంఆర్ఎస్ లో ప్రత్యేక అధికారి విజయనిర్మల, నరసింహలపేట మండల ప్రత్యేక అధికారి ప్రేమ్ కుమార్, చిన్న గూడూరు మండలంలో ప్రత్యేక అధికారి భీమ్లా నాయక్, మరిపెడ ప్రత్యేక అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ తదితరులు విద్యాసంస్థల పునః ప్రారంభం ఏర్పాట్లు తనిఖీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *