మానుకోట పట్టణానికి చెందిన బి విజయ సారధి 1988 లో సిపిఐ లో చేరి నాటి నుంచి నేటి వరకు విద్యార్థి సంఘం నేతగా అఖిలభారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నో విద్యార్థి ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది ఈ ప్రాంతంలో విద్యార్థుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి అనేక విజయాలు సాధించడం జరిగింది అనంతరం పార్టీ నాయకునిగా ఈ ప్రాంతంలో సిపిఐ మహబూబాబాద్ పట్టణ కార్యదర్శిగా ఎన్నికై అనేక భూ పోరాటాలు నిర్వహించి వేలాదిమంది పేద ప్రజలకు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఇంటి స్థలాలు పంచడం జరిగింది . అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసే రైతాంగ ఉద్యమాలు నిర్వహించి రైతుల కోసం గళం విప్పడం జరిగింది . ఈ ప్రాంతంలో ఎంతోమంది పార్టీకి నష్టం చేయాలని చూస్తే మొక్కవోని దీక్షతో పార్టీ కోసం కష్టపడి పని చేయడం జరిగింది అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ సహాయ కార్యదర్శిగా ఎన్నికై ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ నిర్మాణానికి ఎంతో కృషి చేయడం జరిగింది . ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు మిలిటెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది . ఎన్నో భూ పోరాట కేసులు, ఉద్యమ కేసులు తెలంగాణ పోరాట కేసులు పెట్టడం జరిగింది వాటికి భయపడకుండా పోరాటాలు నిర్వహించడం జరిగింది రైతుల కోసం ఉద్యమించి, ముఖ్యంగా ఓడు రైతుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించి మహబూబాబాద్ జిల్లాలో పోడు రైతుల హక్కు పత్రాల కోసం చలో కలెక్టరేట్ చలో RDO ఆఫీస్ అనేక ఆందోళనలు నిర్వహించి కేసులపాలై జైలు జీవితం కూడా గడపడం జరిగింది జైలు జీవితం అనంతరం కొత్త జిల్లాలు ఏర్పడ్డ నేపథ్యంలో మహబూబాబాద్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శిగా ఎన్నికై నాటినుండి నేటి వరకు జిల్లా సమగ్ర అభివృద్ధికై అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అనేక చారిత్రాత్మక ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది ఈ ప్రాంతంలో రైతుల కోసం ప్రజల కోసం ఉద్యోగులస్తుల కోసం విద్యార్థుల కోసం అనేక ఉద్యమాలలో పాల్గొనడం జరిగింది భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై పని చేస్తూ ముందుకు పోవడం జరుగుతున్నది ఈ ప్రాంతంలో దొరలకు ఎదురొడ్డి పోరాటయిన చరిత్ర విజయ సారధి గారిది అనేక మండల ప్రాంతాలలో పార్టీ లేని చోట పార్టీని నిర్మాణం చేసి మండల కేంద్రాల పార్టీకి అండదండలుగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలో రెండవసారి మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రెండవ మహాసభలలో కూడా జిల్లా కార్యదర్శిగా ఎన్నికవ్వడం జరిగింది అదేవిధంగా మహాసభలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారు మరియు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఉమ్మడి వరంగల్ జిల్లా నిర్మాణపాద్యుడు తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు గారు హాజరవడం జరిగింది ఈ సందర్భంగా బి విజయ సారథి మాట్లాడుతూ జిల్లా ప్రాంతంలో జిల్లా సమగ్ర అభివృద్ధికై ఉద్యమాలు చేస్తామన్నారు రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో శక్తివంతన లేకుండా కృషి చేస్తానని ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు వెన్నంటి ఉండి ముందుకు పోతానని అన్నారు విజయ సారధి ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా 3వసారి బి విజయసారథి ఏకగ్రీవ ఎన్నిక
07
Jul