భారత్ వికాస్ పరిషత్ఆధ్వర్యంలో గురువందన

భారత్ వికాస్ పరిషత్ మానుకోట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సూపర్ బజార్ మానుకోట ఎందు ఆషాడ మాసం శుద్ధ పౌర్ణమి వ్యాసం మహర్షి జయంతి సందర్భంగా గురువందన చాత్రాభినందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులందరినీ సన్మానించి విద్యార్థులను అభినందించడం జరిగింది. అధ్యక్షులు కే నాగరాజు, కార్యదర్శి రామకృష్ణ కోశాధికారి జయప్రకాశ్ లోయ మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్ ప్రభాకర్ రెడ్డి సౌత్ రీజినల్ సంస్కార్ కన్వీనర్,, తెలంగాణ ప్రాంత ఉపాధ్యక్షులు వివి నాగేందర్, ఆవుల శ్రీనివాస్ రేణిగుంట్ల గణేష్ కృష్ణ లెనిన్ బాబు పున్నమి చంద్ మల్పాని పాల్గొన్నారు. విద్యార్థులలో దేశభక్తి జాతీయత మానవ విలువలను పెంపొందించడం కోసం భారత్ వికాస్ పరిషత్ పనిచేస్తుంది. విద్యార్థులను సక్రమమైన మార్గంలో తీర్చిదిద్ది ఉన్నత పౌరులుగా చేయడమే ఉపాధ్యాయుల ఆశయమని ముఖ్య అతిథి తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *