ఆత్మ కమిటీ చైర్మన్ గా ఇటీవల నియామకమైన సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నల్లు సుధాకర్ రెడ్డిని పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ గారు ఘన సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు.
హైదరాబాద్ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం లో
ఇటీవల మరిపెడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా నియామకమైన సందర్భంగా పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి , ఎమ్మెల్యే కూణంనేని సాంబశివరావులు శాలువా కప్పి, బొకే ఇచ్చి అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పదవి అలంకార ప్రాయంగా కాకుండా, రైతులకు ఆధునిక సాంకేతికత పై అవగాహన కల్పించి, వ్యవసాయ రంగంలో సాంకేతిక ను ఉపయోగించే విధంగా మీ కమిటీ క్రియాశీలకంగా పని చేయాలని కోరారు.
ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రనాయక్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు
కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ,రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి బి విజయ సారథి, జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారధి రెడ్డి పాల్గొన్నారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణచే ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి కి ఘన సన్మానం
11
Jul