రాష్ట్రస్థాయి బాస్కెట్ బాల్ పోటీలకు జిల్లా జట్లు

ఈనెల 25 నుండి 28 వరకు గద్వాల జిల్లా ఉత్తనూర్ లో జరుగుతున్న బాస్కెట్ బాల్ అండర్- 18 జూనియర్ మహబూబాద్ జిల్లా జట్టు గురువారం బయలుదేరనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా భాస్కర్ బాల్ అసోసియేషన్ సెక్రెటరీ ముల్లంగి ప్రతాపరెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చేలా ప్రధమ స్థానాన్ని సాధించాలని క్రమశిక్షణతో క్రీడల్లో పాల్గొని జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ చీకటి చంద్రన్న, ఎంబీఏ అధ్యక్షులు మొగిలి ప్రసాద్ రెడ్డి, భాస్కెట్ బాల్ కోచ్ వెలిశాల కుమారస్వామి బాలికల పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పద్మావతి, వెంకటేశ్వర్లు, ఎంపికైన జిల్లా బాల బాలికల జట్లు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *