మహబూబాబాద్ డిపో ఆణిముత్యాలు చందా వెంకన్న, గోపు శ్రీనివాస్, సిహెచ్ రమేష్ పదవి విరమణ

మహబూబాబాద్ డిపో నందు సుదీర్ఘకాలం డ్యూటీ చేసి పదవి విరమణ చేయుచున్న డిపో ఆణిముత్యాలు గోపు శ్రీనివాస్Ti2 E/302185 38 సంవత్సరాలు సుదీర్ఘకాలం డ్యూటీ చేసి పదవి విరమణ చేసినాడు. అదేవిధంగా సిహెచ్. రమేష్ ,ఎడిసి ,E/306526, 35 సంవత్సరాలుగా డ్యూటీ చేసి ఈరోజు రిటైర్మెంట్ అయినాడు, మరియు చందా వెంకన్న ఏ డి సి,E/ 342557,32 సంవత్సరాలు కండక్టర్గా డ్యూటీ చేసి ఎడిసిగా ప్రమోషన్ తీసుకొని రిటైర్మెంట్ అయినాడు. ఈ పదవి విరమణ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే గౌరవ శ్రీ మురళి నాయక్ హాజరైనారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ఆర్టీసీలో ఎన్నో రకాల వడిదుడుకులను ఎదుర్కొని డ్యూటీలు చేసి ఉద్యోగ విరమణ చేయడం చాలా సంతోషమని ఇప్పటినుంచి మీరు కొత్తగా జీవితానికి నాంది పలకాలని మీ యొక్క మిగిలిన కాలాన్ని చాలా సంతోషంగా ఆరోగ్యంగా గడపాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. డిపో మేనేజర్ గారు శ్రీ ఎం శివప్రసాద్ మాట్లాడుతూ మా డిపోలో కండక్టర్గా, ఎడిసిగా, టిఐ 2 పనిచేసే ఎడిసిలుగా పనిచేసే మా డిపో ఆణిముత్యాలు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారని వీరికి అభినందనలు వీరి మిగిలిన శేష జీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో సూపర్డెంట్ శ్రీమన్నారాయణ, మెకానికల్ సూపర్డెంట్ పాపిరెడ్డి, ఆఫీస్ సిబ్బంది, ఎడిసిలు, సెక్యూరిటీ సిబ్బంది మరియు ఉద్యోగస్తులు అందరూ బంధుమిత్రులు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *