ఇంచార్జీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో మహబూబాబాద్ పట్టణంలోని వార్డులను, మార్కెట్, జక్షన్లు ప్రాంతాలలొ జరుగుతున్న శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు,పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణకు మున్సిపల్ సిబ్బంది, ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ, షెడ్యూల్ ప్రకారం ప్రతీ రోజూ వార్డులు మార్కెట్ జక్షన్లు ప్రాంతాలలొ శానిటేషన్ చెయ్యాలని, నీరు నిలువ ఉండే ప్రదేశాలలో ఆయిల్ బాల్స్ వేయాలని, వ్యర్థాలను వెంట వెంటనే తరలించి, తడి చెత్త, పోడి చెత్త ను వేరు చేసి సెగ్రిజేషన్ చేయాలన్నారు,
ప్రస్తుతం వర్షాలు కురుస్తునందున, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని,ప్రజలు మున్సిపల్ ఆస్తి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు,
పెండింగ్ లో ఉన్న జంక్షన్లు, అంతర్గత రోడ్ల నిర్మాణం, కాలువలు, తదితర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు,
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి. రాజేశ్వర్, శానిటరీ ఇన్ఫెక్టర్ సుధాకర్, తదితరులు ఉన్నారు.
ప్లాస్టిక్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి (ఇన్చార్జి) కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
08
Aug