మహబూబాబాద్ జిల్లా బేస్ బాల్ సీనియర్స్ మహిళలు, పురుషుల జట్ల ఎంపిక సోమవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగింది. వివిధ మండలాల నుంచి సుమారు 100 మంది క్రీడాకారులు ఈ ఎంపికలో పాల్గొన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 16 నుంచి 18 వరకు హైదరాబాదు జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి సీనియర్ బేస్బాల్ పోటీల్లో పాల్గొంటారని బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కల్లూరు ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ సమ్మెట ప్రేమ్ కుమార్, బేస్ బాల్ అసోసియేషన్ బాధ్యులు ఫిజికల్ డైరెక్టర్లు ఆవారి శ్రీనివాస్, తులసి పద్మావతి, సురేష్ సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
బేస్ బాల్ సీనియర్ మహబూబాబాద్ జిల్లా జట్ల ఎంపిక
12
Aug