ఎస్ ఆర్ నగర్ కాలనీ బతుకమ్మతో కాలనీ మహిళలు

ఇంటిల్లిపాది ఉత్సాహంతో ఊరువాడ కాలనీ కూడళ్ళలో చేరి రంగురంగు పూలను పేర్చి ఆడబిడ్డలు ఆనందంగా, కేరింతల కొడుతూ, బతుకమ్మ… గౌరమ్మ.. భక్తి పాటలతో వైభవంగా జరుపుకునే ప్రకృతి పూల పండుగ బతుకమ్మ వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పసుపు గౌరమ్మను చేసి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ వేడుకలు తొమ్మిది రోజులు పాటు ఆడబిడ్డలు అత్యంత వైభవంగా జరుపుకొని చివరి రోజు బతుకమ్మను పోయిరా… గౌరమ్మ మళ్లీ రా… గౌరమ్మ అంటూ నిమజ్జనం చేస్తారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ నగర్ కాలనీలో మహిళలు కాలనీ బతుకమ్మను ఏర్పాటు చేసి కాలనీ కూడలిలో బతుకమ్మ పాటలతో వేడుకకు సిద్ధమయ్యారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *