నరేష్ రెడ్డి చిరస్మరణీయుడు- ప్రజల గుండెల్లో ఎప్పటికి ఉంటారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు నూకల విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎంపీ ఆర్. సురేందర్ రెడ్డి బతికినంత కాలం ప్రజల కోసమే సేవలు చేసిన మంచి నాయకుడు నూకల నరేష్ రెడ్డి అని, ఆయన భౌతికంగా లేకపోయినా ఈ ప్రాంత ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. మంగళవారం నూకల ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ డా. జాటోతు రాంచంద్రునాయక్, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిలతో కలిసి ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఏరువాక వ్యవసాయ క్షేత్రం వద్ద ఆయన కుమారులు అభినవ్ రెడ్డి, అనిరుథ్ రెడ్డి ఏర్పాటు చేసిన నూకల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజా క్షేత్రంలో ప్రజల బాగు కోసం నాడు స్నేహా యూత్ ఏర్పాటు చేసి దేశంలోనే ఓ గుర్తింపు తెచ్చిన నేత నూకల అని కొనియాడారు. ఆపద అని తలుపు తట్టిన ప్రతి వ్యక్తి కష్టాన్ని తీర్చిన మంచి మనిషి అని, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు ఆయన ఆతిథ్యం స్వీకరించని నాయకులు, ప్రజాప్రతినిధులు లేరని అన్నారు. పార్టీలకు అతీతంగా అందరరీ ఆయన అజాత శత్రువుగానే ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ప్రెసిడెంట్ జిన్నారెడ్డి భరత్ చంద్రా రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరా రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్, నాయకులు గుగులోతు రవినాయక్, పెండ్లి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కాలం రవీందర్ రెడ్డి, బానోతు రాంలాల్, గంధసిరి అంబరీష, మెంచు అశోక్, షేక్ అఫ్జల్, బోర గంగయ్య, గుండగాని సుందర్, తదితరులున్నారు. నివాళులర్పించిన ప్రముఖులు..నూకల ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని సుమారు పదివేలకు పైగా ప్రజానీకం తరలి రాగా, రాష్ట్ర స్థాయి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో మాజీ మంత్రులు డీఎస్ రెడ్యానాయక్, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్ గుడిపుడి నవీన్ రావు, మార్తినేని ధర్మారావు, రాష్ట్ర కమిషన్ సభ్యుడు మాలోత్ లేగుడు నాయక్,ఓడీసీఎంఎస్ మాజీ చైర్మెన్ కుడితి మహేందర్ రెడ్డి, మువ్వా విజయ్ బాబు, నూకల కిషన్ రెడ్డి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *