బంద్‌కు విస్తృత స్పందన
రోడ్డెక్కిన బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు
“సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమం” –తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దేశగాని కృష్ణ, గునిగంటి కమలాకర్ చిత్తారి సోమన్న
చిన్న గూడూరు:
రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మద్దతుగా పిలుపునిచ్చిన బీసీ బంద్ చిన్నగూడూరు మండలంలో విశేష స్పందన పొందింది. ఉదయం నుంచే బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు బంద్ విజయవంతం చేయడానికి రోడ్డెక్కారు. స్థానిక కేంద్రాలు, గ్రామాలలో బీసీ సంఘాల ప్రతినిధులు ర్యాలీలు నిర్వహించి నినాదాలతో మార్మోగించారు.
మండల పరిధిలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, ఆటోలు, చిన్న వ్యాపారాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ప్రజలందరూ బీసీ రిజర్వేషన్ల పెంపును సమర్థిస్తూ ఐకమత్యం చూపించారు. బీసీ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దేశ గాని కృష్ణ,డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గునిగంటి కమలాకర్ తెలంగాణ విద్యార్థి ఉద్యమ కారులు చిత్తారి సోమన్న మాట్లాడుతూ, “బీసీ రిజర్వేషన్ల పెంపు కేవలం ఒక వాగ్దానం కాదు — ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమం. బీసీలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి సరైన రాజకీయ, సామాజిక వాటా రావాల్సిన సమయం ఆసన్నమైంది” అని అన్నారు.
మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాల పక్షాన నిలుస్తుందని, 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం పార్టీ తహతహలతో పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. బీసీ సంఘాల ఐక్యతతో ఈ బంద్ ప్రజా ఉద్యమంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిక్కు, మండల ప్రధాన కార్యదర్శిలు పట్ల రవికిరణ్, నాగేష్, చిన్నగుడురు యువజన కాంగ్రెస్ నాయకులు గాడిపెల్లి జివన్, మండల యూత్ అధ్యక్షులు రాజు ముదిరాజ్, సీనియర్ పాత్రికేయులు జంపాల చక్రధర్, మాజీ ఎంపిటిసి కొమరెల్లి, గ్రామ అధ్యక్షులు బత్యం రమేష్, గౌడ సంఘ నాయకులు సత్యనారాయణ, బర్తపుర రమేష్, గంధసిర వెంకన్న, బాబు, రామన్న, భద్రయ్య, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు వెంకన్న, భారతపురం నియోజకవర్గ యుత్ కాంగ్రెస్ నాయకులు సందీప్ యాకన్న, దాసరి శ్రీను, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు గండి ఉప్పలయ్య, మరసాని శ్రీను, జంపాలా శ్రీనివాస్, బెడద మధు, గంగాధర ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.