చలి కాలంలో డ్రైవర్లు తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లా ఎస్పీ సూచనలు

పొగమంచు వలన రోడ్డు, వాహనాలు, పాదచారులు, జంతువులు, మరియు సిగ్నల్స్ సరిగ్గా కనిపించవు. ఈ కాలంలో డ్రైవర్లు ముందు ఉన్న వాహనాలు మరియు ఆగి ఉన్న వాహనాలు ఎంత దూరం ఉన్నాయో అంచనావేయడం కష్టం అవుతుంది. ఈ చలి కాలంలో డ్రైవర్లు ఈ క్రింద తెలిపిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చు. గమ్యస్థానానికి వెళ్ళవలసిన క్రమంలో కొద్దిగా ముందుగానే బయలుదేరండి. (పొగమంచు వలన ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది కనుక ముందుగా బయలుదేరితే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తొందరగా వెళ్ళాలనే ఆలోచనను నివారించవచ్చు).
అతివేగాన్ని మరియు ఓవర్ టేకింగ్ నివారించండి. (ముందుగా ఉన్న వాహనాలు మరియు రోడ్డ్డు కనిపించకపోవడం వలన మరియు వేగంగా వెళ్ళడం వలన వాహనం కంట్రోల్ తప్పే ప్రమాదం మరియు ఓవర్ టేకింగ్ వలన ముందున్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనావేయడం కష్టం).
లోబీమ్ లైట్లను వాడండి. (పొగ మంచు వలన హై బీమ్ లైట్ల నుండి వచ్చే కాంతి విచ్ఛిన్నమై ముందు చూడడం కష్టం అవుతుంది. లోబీమ్ లైట్లు ఉండటం వలన వెనుక లైట్లు, మిగతా వాహనదారులకు క్లియర్ గా మీ వాహనం ఎంత దూరంలో ఉందో తెలుస్తుంది. ఫాగ్ లైట్లు
(fog lights) ఉన్న యెడల, వాటిని వాడవలసినదిగా విజ్ఞప్తి).
ముందు ఉన్న వాహనానికి మీ వాహనానికి మధ్య సురక్షిత దూరాన్ని ఉంచండి. (దాని వలన ముందున్న వాహనం సడన్ బ్రేక్ వేసినా మరియు వాహనం ఎక్కడ ఉందో అంచనా వేయడంలో తప్పు జరిగినా, ముందున్న వాహనాన్ని ఢీకొట్టడాన్ని నివారించవచ్చు).
నిర్దేశించబడిన లేన్లలో వాహనాన్ని నడపండి. (ఇష్టం వచ్చినట్లు లేన్ క్రమశిక్షణ లేకుండా నడపడం వలన ముందున్న వాహనాలను గుర్తించడం కష్టం అవుతుంది).
వాహనాన్నినడిపేటప్పుడు కొద్దిగా కిటికీ అద్దాలను దించండి. (అద్దాలను దించడంవలన పొగమంచు ఒకేదగ్గర కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నం అవుతుంది. దాని వలన డ్రైవర్ దృష్టి మెరుగు పడుతుంది ).
కొన్నిసార్లు పొగమంచు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కాసేపు వాహనాన్ని ఆపి మరల వాహనాన్ని నడపండి. (మీకు ముందు ఉన్న వాహనాలు, రోడ్డు సరిగ్గా కనిపించకపోతే వాహనాన్ని నడపవద్దు. లేనియెడల ముందున్న వాహనం ఎంతదూరం ఉందో అంచనా వేయడం కష్టం. గమ్యస్థానానికి వెళ్ళే తొందరలో తప్పులు చేయవద్దు).
మీ వాహనం ముందు కిటికీ అద్దాలను వెనుక ఉన్న అద్దాలను శుభ్రంగా ఉంచుకోండి. (పొగమంచు అద్దాలను కవర్ చేయడం వలన దృష్టి తగ్గుతుంది. మీ వాహనం యొక్క వైపర్లను, డీప్రాస్టర్లను అవసరాన్ని బట్టి వాడుతూ అద్దాలను క్లియర్ గా ఉంచండి).
ముందుగా ఇన్డికేటర్లను ఉపయోగించండి. (మీరు ఎటువైపు వెళుతున్నారో వెనుక వచ్చే వాహనానికి ముందుగా తెలిసేటట్లు జాగ్రత్త తీసుకోండి. లేని యెడల వెనుక వచ్చే వాహనం ముందున్న వాహనం ఎటు వెళుతుందో అంచనావేయడంలో తప్పు చేయవచ్చు. వెనుక వచ్చే డ్రైవర్లకు కొంత సమయం ఉండేటట్లు ఇండికేటర్లతో సిగ్నల్ ఇవ్వండి). సడన్ బ్రేకింగ్ వేయడాన్ని నివారించండి. చలికాలంలో రోడ్డు తడిగా ఉండటంవలన వాహనాలు స్కిడ్ అవడం మరియు స్లిప్ అవ్వడం జరుగుతుంది. నిర్దిష్ట స్పీడ్ తో వాహనాలను నడపడం వలన, స్లిప్పరీ రోడ్ల నుండి వాహనాలు స్కిడ్ కాకుండా నివారించవచ్చు. సడన్ బ్రేక్ లు వేయడం వలన స్లిప్పరీ రోడ్ మీద వాహనం అదుపు తప్పేప్రమాదముంది. అందుచేత బ్రేక్ లను నెమ్మదిగా అప్ప్లయ్ చేయండి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *