మహా తెలంగాణ/ కురివి
కురవి మండల కేంద్రంలో నేరడ గ్రామంలో బుధవారం నాడు వరంగల్ డీసీసీ బ్యాంక్, నూతనముగా ఏర్పాటు చేసిన కురవి శాఖ ఆధ్వర్యంలో, నాబార్డ్ వారి ఆర్థిక సహకారంతో ఆర్థిక అక్షరాస్యత అవగాహనా కార్యక్రమం ఎఫ్ ఎల్ సి (FLC) నుక్కడ్ నాటకం శ్రీ వై రమేష్ కళాజాతర బృందం ద్వారా ప్రదర్శన నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీమతి సింధు ప్రజలకు బ్యాంక్ ఖాతా మరియు పొదుపు యొక్క ప్రాముఖ్యత, (ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన), (ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన), కేవైసీ మరియు రీ కేవైసీ ( KYC, Re-KYC, )అలాగే బ్యాంకు ద్వారా అందిస్తున్న వివిధ రకాల రుణ సౌకర్యాల గురించి వివరంగా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేరడ సర్పంచ్ శ్రీ గౌతమి , నాబార్డ్ డి డి ఎం (DDM) శ్రీరామ్ ,(LDM) ఎల్ డి ఎం యాదగిరి మరియు కురవి దేవాలయ ఛైర్మన్ కొర్ని రవీందర్ రెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
బ్యాంక్ తరఫున శ్రీమతి సింధు గారు (బ్రాంచ్ మేనేజర్),కాంపెల్లి సెక్రటరీ శ్రీమాన్ , ఉపసర్పంచ్ వెంకన్న గారు పాల్గొన్నారు.
గ్రామంలోని రైతులు, మహిళలు, యువత మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రజలు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకుని పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని, ప్రభుత్వ బీమా పథకాలలో చేరి ఆర్థిక భద్రతను పొందాలని కళా బృందం వారు సూచించారు.
https://mahatelangana.in/38434/