జిల్లా విద్యాశాఖ అధికారి అల్వాల సత్యనారాయణమూర్తి
మహాతెలంగాణ /మహబూబాబాద్ :
రేపు సోమవారం ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లమెంటరీ మ్యాథమెటిక్స్ పరీక్ష ఉంటుందని విద్యాశాఖ అధికారి అల్వాల సత్యనారాయణమూర్తి తెలిపారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఎస్ఎస్సి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాల సెంటర్లో ఇంగ్లీష్ పరీక్షకు 52మంది అలాట్మెంట్ కాగా 46 మంది విద్యార్థుల హాజరై (06) ఆరుగురు గైర్హాజరయ్యారని. రేపు సోమవారం మ్యాథమెటిక్స్ పరీక్షా ఉంటుందని, ఈ పరీక్ష రాసే సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయులు మరియు సంబంధిత సబ్జెక్టు టీచర్స్ బాధ్యత తీసుకొని ఫీజు చెల్లించిన ప్రతి ఒక్కవిద్యార్థి పరీక్షకు హాజరయ్యే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని హాజరయ్యే విధంగా చూడాలన్నారు. పరీక్ష నిర్వహణలో సీఎస్ మరియు డిఓఎస్ సిట్టింగ్ స్క్వాడ్ విధులను నిర్వహించారు.