భూమి, కూలి, ఉపాధి రక్షణకై ఉద్యమించండి

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య

మహాతెలంగాణ/ కేసముద్రం

భూమి, కూలి,ఉపాధి రక్షణకై ప్రజలందరూ ఉద్యమాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య పిలుపునిచ్చారు. మహాసభల ప్రారంభ సూచికగా సంగం జిల్లా నాయకులు గోడిశాల వెంకన్న సంగం పతాకావిష్కరణ చేయడం జరిగింది.బుధవారం రోజు కేసముద్రం మండల కేంద్రంలో హరహర గార్డెన్ లో సంఘo ఉపాధ్యక్షులు ఎండి యాకుబ్ , బాణాల రాజన్న, అందే మంజుల అధ్యక్షతన 3వ మహాసభలు జరిగాయి. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య హాజరై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో భూస్వాముల చేతిలో ఇంకా 10లక్షల ఎకరాల భూమి ఉందని, ప్రభుత్వం వెంటనే దానిని తీసి అర్హులైన పేదలకు పంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు పేదలకు అనుకూలంగా కాకుండా భూస్వాముల ప్రయోజనాలకు అనుకూలంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మార్చుకొని పేదలకు భూములు పంచాలని లేనియెడల జూన్ చివరి వారంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పేదలే భూములను వెలికి తీసి సంఘం ఆధ్వర్యంలో భూములు పంచె కార్యక్రమం నిర్వహిస్తామని వారి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని, కనీసం పని ప్రదేశాలలో మంచినీరు, టెంట్, మెడికల్ కిట్ లాంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాంతోపాటు రోజువారి కనీస వేతనం 600 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు గ్రామాలలో రోజువారి కూలీ 150, 200 రూపాయలు మాత్రమే ఉపాధి కూలీ ఇస్తున్నారని వారు అన్నారు. ఈ పద్ధతి మార్చి కనీస వేతనం 600 ఇవ్వాలని , పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కూలి బందు ప్రకటించింది కానీ ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు, కూలి బందు పథకo కింద భూమిలేని ప్రతికూలికి సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలు మాత్రం పేదలకు ఎగనామం పెట్టిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇండ్లు లేని నిరుపేద కూలీలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పోడు రైతులకు హక్కు పత్రాలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం, సంవత్సరాలు గడిచినా కూడా గిరిజనులకు గాని గిరిజన ఇతరులకు గాని అక్కుపత్రాలు నామమాత్రంగానే ఇచ్చి చేతులు దులుపుకుందని వారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేశారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.కూలీలు ఆత్మగౌరవం పెరగాలంటే కూలీలకు భూస్వాముల దగ్గర నిరుపయోగంగా ఉన్న భూములను వెలికితీసి భూములు పంచాలనీ, పనికి తగ్గట్టుగా కూలీ ఇవ్వాలని, ప్రతి వ్యక్తికి ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని వీటన్నిటి సాధన కోసం ప్రజలందరూ ఉద్యమించాల్సిన అవసరం రానున్న రోజుల్లో ఉందని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలవాల వీరయ్య కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సాదుల శ్రీనివాస్, ఆకుల రాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న, ఐద్వ సంఘం జిల్లా అధ్యక్షురాలు కందునూరి కవిత, వృతి సంఘాల జిల్లా కన్వీనర్ బొల్లం అశోక్, పిఎన్ ఎం జిల్లా కార్యదర్శి నక్క సైదులు, రాష్ట్ర కమిటీ సభ్యులు వంగూరి వెంకటేశ్వర్లు, కేసముద్రం మండల కార్యదర్శి గుడిశాల వెంకన్న, మండల అధ్యక్షులు ముద్రకోల సారయ్య, కావటి నర్సయ్య,బొబ్బల యాకుబ్ రెడ్డి, నీరుటి జలంధర్,శ్రీశైలం,జయరాజు, మోడెం వెంకటేశ్వర్లు,సావిత్ర, చందా వెంకన్న,గంధసిరి శ్రీను, కడియం సత్యం, ఇసంపల్లి సైదులు, రమేష్ బోర. స్వామి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *