సమాజంలో అసమానతలు తొలగించడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ దా.నాగవాణి

మహాతెలంగాణ /మహబూబాబాద్ :

మహబూబాబాద్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ‘షేర్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ (జెఆర్సి)విభాగం అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జెఆర్సి) మహబూబాబాద్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ దా.నాగవాణి మాట్లాడుతూ..సమాజంలో పేరుకుపోయిన సామాజిక అసమానతలు, అనాచారాల నిర్మూలనలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. కేవలం పుస్తకాల్లోని చదువునే కాకుండా, పిల్లలను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. సమాజంలో బాల్యవివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, వివక్ష వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో గురువుల పాత్ర ఎనలేనిదని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాల ఉపాధ్యాయులందరినీ శాలువాలతో సత్కరించారు.అనంతరం షేర్ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి విద్యార్థినులకు ‘బాల్య వివాహ రహిత భారత్’ అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు లేదా బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్), 181 (మహిళా హెల్ప్‌లైన్) నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సీనియర్ న్యాయవాది చెన్న మల్లా రెడ్డి, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సెల్ రాజకృష్ణ లు మాట్లాడుతూ..సమాజ నిర్మాణంలో, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు పోషిస్తున్న పాత్రను కొనియాడారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఉపాధ్యాయులు ఆ జీవితానికి ఒక సార్థకతను, మార్గాన్ని చూపిస్తారని హితవు పలికారు. ఈ సందర్బంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం జూనియర్ కళాశాల ఉపాధ్యాయులందరినీ శాలువాలతో సత్కరించారు. బాధితులకు అవసరమైన న్యాయ సహాయాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా అందిస్తుందని పేర్కొన్నారు ఉచిత న్యాయ సలహా మరియు సహాయం కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 15100 ను సంప్రదించవలెనని కోరారు . ఈ కార్యక్రమం లో కేజీబీవీ ప్రత్యేక అధికారిణి భవాని ‘సఖి’ నుండి షాజన్,లవన్య , షేర్ జెఆర్సి కమ్యూనిటీ మొబైలెజర్ రమేష్, సోమన్న,హిమబిందు, ఉమామహేశ్వరి, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *