మహాతెలంగాణ/మహబూబాబాద్:
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పెత్ర మాసం సందర్బంగా చనిపోయిన పెద్దలను స్మరిస్తూ బియ్యం సమర్పించే ఆచారంలో బాగంగా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న 1400 వందల మంది అమరులను స్మరించుకుంటూ తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. డోలి సత్యనారాయణ తదితరులు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి బియ్యం సమర్పించి అమరులకు జహార్లు అర్పించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు అమలు చేసినపుడే అమరులకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు.*ఈకార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు మైస శ్రీనివాస్, పిల్లి సుధాకర్, శంతన్ రామరాజు, ఖాజాపాష, మైస నాగయ్య, మామిడాల సత్యనారాయణ, బాలిష్ట రమేష్, కందగట్ల వెంకన్న,కృష్ణ ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.