సాఫ్ట్ బాల్ జూనియర్స్ బాలికల జిల్లా జట్టు ఎంపిక

మహాతెలంగాణ/మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లా సాఫ్ట్బాల్ జూనియర్స్ బాలికల చెట్టు సెలక్షన్స్ ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగాయి జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రెటరీ సమ్మెట ప్రేమ్ కుమార్, బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కల్లూరి ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 31 నుంచి నిర్మల్ లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వారు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులు క్రమశిక్షణతో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని మరింత మెలకువలు నేర్చుకొని టీచింగ్ క్యాచింగ్ పై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. మహబూబాబాద్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాణించేలా క్యాంపులు నిర్వహించి తీర్చిదిద్దేందుకుతాము కృషి చేస్తామని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యతలు అవారి శ్రీనివాస్, జిల్లా భాస్కెట్ బాల్ కోచ్ వెలిశాల కుమార స్వామి, ఫిజికల్ డైరెక్టర్లు పిల్లి కాశీనాథ్, లలిత, ప్రణయ్, సురేష్, సునీత, సీనియర్ క్రీడాకారులు నవీన్, ఉదయ్, పవన్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *