జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ క్రీడల బహుమతి ప్రధానోత్సవం

మహబూబాద్ :

గత రెండు రోజులుగా మహబూబాద్ గిరిజన భవనం ఇండోర్లో జరుగుతున్న మహబూబాద్ జిల్లా స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడల ముగింపు కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు డాక్టర్ మూల జితేందర్ రెడ్డి గారు హాజరై విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది.
జిల్లా కార్యదర్శి డాక్టర్ కొమ్ము రాజేందర్ తన నివేదికలో జిల్లా నలుమూలల నుండి దాదాపు 9 విభాగాలలో 60 జట్లు పాల్గొన్నాయని, క్రీడాకారులు తమ అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించి రాష్ట్ర స్థాయి క్రీడలకు అర్హత సాధించడం జరిగింది అని తెలిపారు.
జిల్లా అధ్యక్షులు డాక్టర్ జితేందర్ రెడ్డి, విజేతైన క్రీడాకారులకు అభినందన తెలుపుతూ, రాష్ట్ర స్థాయిలో కూడా విజయం సాధించి మహబూబాబా దు జిల్లాకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రెఫరీ ఆర్.. శ్యాం కుమార్, మ్యాచ్ కంట్రోల్ మట్టపల్లి భాస్కర్, అంపైర్లు ఆనంద్, , రమేష్ చారి, ఈసీ మెంబర్ కుంజ సతీష్, సీనియర్ క్రీడాకారులు కృష్ణ, కోటిరెడ్డి, రవి వర్మ సమీర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *