ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్

రూరల్ పోలీస్ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్

మహబూబాబాద్ :

మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, రికార్డులు, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు మరింత స్నేహపూర్వక వాతావరణంలో సేవలు అందించాలని పోలీస్ సిబ్బందికి సూచించిన ఎస్పీ,దూర ప్రాంతాల నుండి పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలు ప్రస్తుత ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం పోలీస్ అధికారులతో సమావేశమైన ఎస్పీ గారు మాట్లాడుతూ, యువతను గంజా వంటి మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందన్నారు. గ్రామ స్థాయిలో రాత్రి పహారా (నైట్ పట్రోలింగ్) విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు.

అలాగే తమ పరిధిలో ఉన్న హోటల్స్, లాడ్జ్‌లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అనుమానాస్పద వ్యక్తులు, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాల్లో సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండేలా సూచనలు ఇవ్వాలని తెలిపారు.

గంజా వంటి మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని, వాటి దుష్పరిణామాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

గంజా సంబంధిత సమాచారం తెలిసిన ప్రజలు వెంటనే 8712656999 నంబర్‌కు సమాచారం అందించాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ IPS ప్రజలను కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *