జాతీయ స్థాయి జూడో పోటీలకు నర్సింహులపేట బాలిక

మహాతెలంగాణ/నర్సింహులపేట మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన బాల్నే శ్రీనివాస్ కూతురు యశ్వంతిక కరీంనగర్ జిల్లాలోని రీజినల్ క్రీడా పాఠశాలలో పదవ తరగతి విద్యనభ్యసిస్తుంది.గురువారం వరంగల్ లో జరిగిన రాష్ట్ర స్థాయి 44 కేజీల జూడో పోటీల్లో గెలిచి జాతీయ స్థాయికి ఎంపికైంది.ఈ పోటీల్లో భాగంగా అత్యంత ప్రతిభ కనబర్చి బంగారు పతనం కూడా సాధించింది.ఈనెల 10న చండీఘర్ లో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ప్రతినిధ్యం వహించనుంది. మండల కేంద్రం నుండి జాతీయ స్థాయి పోటీలకు బాలిక ఎంపిక పట్ల మండల ప్రజలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *