విత్తనాల ధుకాణాలపై ఆకస్మిక తనికీలు

గడవు దాటిన విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

ఏఈ రామారావు, ఎస్సై సాయి కుమార్

మహా తెలంగాణ/గార్ల

ప్రభుత్వ అనుమతి లేని గడువు దాటిన విత్తనాలను, ఎరువులను దుకాణాలలో నిల్వుంచినా అమ్మాలని చూసినా కఠిన చర్యలు తప్పవని సీడ్ టాస్క్ఫోర్స్ అధికారులు మండల వ్యసాయధికారి కావటి రామారావు, ఎస్ఐ సాయికుమార్,లు హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని ఎరువుల, విత్తనాల ధుకాణాలను తనికీ చేశారు. దుకాణాలలో విత్తనాల నిల్వలు, లైసెన్సులు స్టాక్ రిజిస్టార్,లు బిల్లులు లేబులింగ్, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి లేని బీటి 3, విత్తనాలను షాపు యందు నిల్వఉంచినా రైతులకు అమ్మాలని చూసినా సంబందిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అనధికార గడువు దాటిన విత్తనాలను రైతులకు అమ్మితే ఉపేక్షించేది లేదని హచ్చరించారు. షాపులలో విత్త నాల నిల్వ బోర్డులను రైతులకు కనిపించేలా ఏర్పాటు చేయాలని, విత్తనాలు అమ్మే సమయంలో రైతులకు బిల్లులు తప్పకుండా ఇవ్వాలని, నాన్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అమ్మాలని, రైతులు కోరిన విత్తనాలను ఇవ్వాలని తెలిపారు. స్టాక్ రిజిస్టర్ లు ఎప్పటికప్పుటు అప్డేట్ చేయాలని, స్టాక్ రిపోర్ట్ స్టాక్ వచ్చిన వెంటనే వ్యవసాయ అధికారికి తెలియజేయాలని అలసత్వం వహిస్తే శాఖా పరమైన కఠిన చర్యలు తప్పవని సూచించారు. రైతులు విత్తనాలు కొనేముందు ప్రభుత్వ లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే కొనుగోలు చేసి బిల్లులను పంట సీజన్ ముగిసే వరకు =భద్రపరుచుకోవాలని, గ్రామాలలో సంచరిస్తూ గుడ్డ సంచులలో లేబుల్ లేని విత్తనాలు అమ్మేవారివద్ద కొని మోసపోవద్దని రైతులకు సూచించారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *