మహా తెలంగాణ /నర్సింహులపేట
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండలంలోని పడమటిగూడెంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామ ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి ఆయన దేశానికి అందిస్తున్న సేవలను కొనియాడారు.
వక్తలు మాట్లాడుతూ, యువతకు ఆదర్శంగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, యువత ఉపాధి, రైతుల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య,ఉపసర్పంచ్ నవీన్ రెడ్డి,చిర్ర ఉపేందర్, జక్కి యాకసాయిలు,గువ్వా వెంకన్న, జొన్నగడ్డ యాకన్న, జక్కి మురళి, సురేష్,మండల సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ పాల్గొన్నారు.